|
| దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు | |
దీపావళిని గూర్చి మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని, తనను మించిన వాడెవడూ లేడనే గర్వంతో విర్రవీగిన నరకుడిని శ్రీకృష్ణ భగవానుడు వధించాడు.
దీన్ని బట్టి చూస్తే నరుకుని వలే వక్ర మార్గాలను ఆశ్రయించి, అమాయకులను పీడించినా వాళ్లకు అతనికి పట్టిన గతే పడుతుందని దీపావళి పండుగ నేపథ్యం తెలుపుతోంది. హింసామార్గం ఎంతటి వారినైనా బలితీసుకుంటుంది అన్నది మనకు కనపడుతుంది. ప్రతి వారికి శ్రద్ధ, ఓర్పు, సహనం ఎంత అవసరమో శ్రీకృష్ణుడు తనదైన శైలిలో విశదీకరిస్తాడు.
నాది, మనది అంటూ అనుక్షణం కలవరించే ఈ లోకంలో ఏదీ మనది కాదని కృష్ణుడు చెప్పకనే చెబుతాడు. మనకొచ్చిన ఈ విలువైన జీవితాన్ని మంచి పనులకే ఉపయోగించి, మనలోని దానవత్వంపై పైచేయి సాధించాలనేదే దీపావళి పండుగ నేపథ్యం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|