యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం వ్రతాలు - పండుగలు
దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం
- సంకలనం: వెంగళరావు
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.

అతని మరణంతో లోకాలన్నీ పండుగ చేసుకున్నాయి. బాణా సంచా పేల్చడం ద్వారా ఆ ఆనందాన్ని చాటి చెప్పాయి. ఆ విధంగా బాణా సంచాతో దీపావళి పండుగ ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్దా, చిన్నా కుల, మత భేదాలు లేకుండా ఈ పండుగను దేశ మంతటా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.

బ్రహ్మదేవుని వర గర్వంతో విర్రవీగుతున్న నరకాసురుని శ్రీకృష్ణ భగవానుడు వధించిన రోజునే దీపావళి పండుగగా మనం జరుపుకుంటున్నాము. నరకునితో జరిగిన పోరు వేకువజామున ముగియడంతో ఆ రోజు వేకువజామునే మేల్కొని, నూనెతో తలంటి వేన్నీళ్లతో స్నానం చేస్తారు. కొత్త వస్త్రాలతో పవిత్రంగా శ్రీకృష్ణనితో పాటు ధనానికి మూలమైన లక్ష్మీదేవిని పూజించి తరించడం హిందువుల ఆనవాయితీ.

సకల దేవతలు పూజించడంతో సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో లోకకంఠకుడైన నరకాసురుని సంహరించేందుకు చక్రాయుధాన్ని సంధించే యత్నం చేస్తాడు. అంతలోనే నరకుడు విసిరిన గధాయుధం శ్రీకృష్ణుని నుదుట భాగాన్ని తాకగానే మూర్చపోయాడు.

దీంతో సత్యభామ రూపమైన భూదేవి ఆగ్రహించి విల్లుతో నరకుణ్ని వధించి అన్ని లోకాల్లో తిరిగి శాంతి కిరణాలను ప్రసరింపచేసింది. నరకుని వధతో ఆనంద పారవశ్యులైన దేవతలు సత్యభామ విజయం అనంతరం ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు
భిన్న పద్దతుల్లో దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు
యాహూ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు
శ్రీవారి బ్రహ్మోత్సవ సేవలు - వాటి వివరాలు
గణనాధుని పాదాలకు పత్రపూజ
నీలాపనిందలు: చవితి నాటి చంద్రుడు
భవిష్యత్
తారాఫలం - తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకునేందుకు కారకులైన యువ క్రికెటర్లలో...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసి
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace