|
| దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు | |
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కథలను తెలుసుకుందాం...
ప్రాధ్యోషపురాన్ని పరిపాలించిన నరకాసురుడు బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు.
నరకాసురుని పీడ విరగడవడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటున్నారు. ఆ పరంపర నేటికీ దీపావళి పేరుతో కొనసాగుతోంది.
రామాయణం గురించి మీరు వినే ఉంటారు. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతా సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తున్న సమయంలో సీతమ్మను లంకాధీశుడైన రావణాసురుడు అపహరించుకుని వెళతాడు.
ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య కావడంతో అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.
మరణాన్ని దరి చేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని మదిస్తుండగా లక్ష్మిదేవి ఉద్భవించిన రోజునే దీపావళిగా జరుపుకుంటున్నట్టు మరో కథనం కూడా వాడుకలో ఉంది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మహా భారతంలోని ఇతివృత్తాన్ని ప్రకారం కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
మరో వృత్తాంతంలో గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి ధన్యవాదాలు తెలిపే రీతిలో ప్రత్యేక పూజలు చేసి ఈ పండుగ జరుపుకుంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకునేందుకు కారకులైన యువ క్రికెటర్లలో... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|