|
| యాహూ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు |
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే అకజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకద0తముపాస్మహే..!
అంటూ తమ పనులు సకాలంలో పూర్తి కావాలని ప్రతిరోజు వినాయుకుని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. భారతదేశ సంసృతి, సాంప్రదాయాల మేళవింపుతో ప్రతి ఏడాది విశిష్టంగా జరుపుకునే ఈ వినాయక చవితి ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు.
భాద్రపద శుక్ల చవితిన హస్తా నక్షత్రం, కన్యారాశిలో జన్మించిన వినాయకుడు సమస్త లోకాలకు పూజనీయుడు. బ్రహ్మాండాన్నే తన బొజ్జలో దాచిన ఓంకార స్వరూపుడు వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. గణనాధుని పూజించిన వారికి సిద్ధులను, బుద్ధులను ప్రసాదించి తన కరుణాకటాక్షాలతో నిత్యం తన అభయహస్తాన్నిస్తాడు.
బ్రహ్మవైవర్తన పురాణంలో గణ అన్న శబ్దంలో 'గ' అంటే విజ్ఞానమని, ణ అంటే మోక్షము, ముక్తి అని చెప్పియున్నారు. విశ్వాంతరాళాల యుగసంధిలో విశృంఖలమైన కాంతులతో విరాజిల్లే సర్వలోక జనప్రియుడు వినాయకుడు. అహంకారానికి ప్రతిరూపమైన మూషికాన్ని తన వాహనంగా చేసుకుని సర్వ విఘ్నాలను తొలిగించే విఘ్న హరుడు విఘ్నేశ్వరుడు.
అఖలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన విఘ్నేశ్వరున్ని మహా గణపతి, హరిద్రాగణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అను ఆరు రూపాలలో పూజలు చేస్తుంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|