|
| నీలాపనిందలు: చవితి నాటి చంద్రుడు | |
ముల్లోకాల్లో పూజలందుకుంటూ కైలాసం చేరుకుంటున్న వింత స్వరూపుడైన వినాయకుని చూసి చంద్రుడు విరగబడి నవ్వాడు. దీంతో వినాయకుడు కోపించి ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరు నీలాపనిందలు పాలవుదురుగాక అని శపించెను.
అంతటితో చంద్రుడు తన తప్పిదాన్ని మన్నించమని పరిపరివిధాల ప్రార్థించగా, భాద్రపద శుద్ధ చవితినాడు నా జన్మ వృత్తాంతము నా జన్మదినమున విని నన్ను పూజించిన వారికి నీలాపనిందలు కలుగవని శాపవిమోచనం అనుగ్రహించాడు.
వినాయక చవితి వ్రత మాహాత్మ్యమును పరమశివుడు కుమారస్వామికి తెలియజేయగా అట్టి ఈ వ్రత కథను నైమిశారణ్యమందు సూతమహర్షి శౌనకాది మునులకు చెప్పుసమయాన వనవాసము చేస్తున్న ధర్మరాజు కూడా విని ఈ వ్రతమాచరించి తిరిగి రాజ్య సంపదను పొందెను.
దమయంతి ఈ వ్రతమాచరించి నలమహారాజును, రాజ్య సంపద తిరిగి పొందెను. శ్రీకృష్ణుడంతటివాడు పాలపాత్రయందు చవితి చంద్రుని చూచి నీలాపనిందలపాలైయ్యాడు. ఈ వ్రతమాచరించి అటు శమంతక మణితోపాటుగా జాంబవతి, సత్యభామలను భార్యలుగా పొందాడు.
మానవులు ఈ వ్రతమును చేయుట వల్ల సమస్త సిరిసంపదలు, పుత్రపౌత్రాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సుఖ సౌభాగ్యాలు పొందుతారని సూత మునిశ్రేష్టుడు వివరించాడు. ఇట్టి మహాత్మ్యముగల ఈ సిద్ధి వినాయక వ్రతము మనమంతా భక్తి ప్రపత్తులతో ఆచరించి పునీతులమౌదాం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|