|
| రాఖీ పండుగ ఎలా వచ్చిందంటే...
|
| సోమవారం, 27 ఆగస్టు 2007 ( 15:20 IST ) | |
పూర్వం దేవతలు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారంతో అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి "శచీదేవి" తరుణోపాయముకై ఆలోనలో పడుతుంది. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా ఆక్రమించుకోబోతున్న విషయం శచీదేవికి తెలుస్తుంది.
దీనితో చేసేది ఏమీలేక సరిగా అదే రోజు శ్రావణ పూర్ణిమ అవడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, ఆ పూజించబడిన "రక్షా"ను శచీదేవి భర్త దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునికి కట్టి యుద్ధానికి పంపుతారు. ఈ విధంగా "రక్ష" ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలిచి, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందడానికి దోహదపడుతుంది.
ఆనాడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనోత్సవం నేడు రాఖీ పండుగగా ఆచరించబడుతోంది. ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భర్తకు భార్య, సోదరులకు సోదరి కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మార్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్‌సంప్రదాయమే ఈ రాఖీ విశిష్టత.
అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరు కానుకలు సమర్పించి, అందరూ కలసి చక్కని విందు సేవిస్తారు. పూర్వం భర్తలకు భార్యలు కూడా రాఖీలు కట్టే ఆచారంలో అమల్లో ఉండగా, ప్రస్తుతం ఎక్కువగా సోదరులకు సోదరి మాత్రమే రాఖీలు కట్టడం జరుగుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| షూటింగ్ ముచ్చట్లు - శ్రీకాంత్ హీరోగా, మీరా జాస్మిన్, రీమా సేన్ హీరోయిన్లుగా ప్రేమ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|