యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
అయప్ప దర్శనానికి వెళ్ళ వలసిన వేళా విశేషాలు
- సంకలనం: వెంగళరావు
భారత్‌లో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళ్ళి దర్శించుకునే ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి శబరిమలై. ధర్మస్థలా అని పిలువబడే అయ్యప్ప స్వామి శబరిమలై ఆలయంలో కొలువుదీరారు. శబరిమలైకు వెళ్ళేందుకు అనువైన కాలం నవంబర్ నుంచి జనవరి వరకు.

మండల దీపారాధన నుంచి మకర మహారాధన సమయం వరకు శబరిమలైకు వెళ్ళేవారు కఠోర వ్రతాన్ని ఆచరించాల్సి ఉంది. ప్రతి మళయాల మాసం తొలి ఐదు రోజులు ఆలయం తెరిచే ఉంటుంది. ఆ సమయాలలో కూడా లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఈ రోజుల్లోనే కాకుండా విషు (మళయాల సంవత్సరాది) ఓనం వంటి పండుగ దినాల్లో కూడా దైవదర్శనాన్ని పొందగలము.

చెన్నై నుంచి శబరిమలైకు వెళ్ళాలంటే:

రైలు మార్గం- చెన్నై నుంచి రైలులో బయలుదేరి కొట్టాయం లేక సెంగనూరు స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి పత్తానాం తిట్టం ప్రాంతానికి బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి పంబకు వెళ్ళేందుకు ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి.

ఇలా కాకుండా వేరే మార్గం కూడా ఉంది. కంబం మార్గంలో కేరళలోని వండిపెరియార్ వెళ్ళాలి. అక్కడి నుంచి ఎరిమేరి మార్గంలో పంబకు చేరుకోవచ్చు.

బస్సు ప్రయాణం మాత్రమే కాకుండా జీప్ సౌకర్యం కూడా ఉంటుంది. సాల్కాయిన్ మార్గంలో ఎరిమేరికి చేరి అక్కడి నుంచి కరిమలే (పర్వతం)ఎక్కి, అవతలి వైపుకు దిగి యాభై కిలో మీటర్లు పాదయాత్ర ద్వారా అయ్యప్పను దర్శించుకోవచ్చు.

కోట్టయం లేక సెంగనూర్‌ మార్గంలో వ్యాన్ ద్వారా శబరి మలైకు చేరే భక్తులు ఎక్కవ సంఖ్యలో ఉన్నారు. విమాన మార్గంలో వెళ్ళాలనుకుంటే తిరువనంతపురం లేక కొచికు చేరి అక్కడి నుంచి వాహనం ద్వారా రోడ్డు మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్
ఇస్లాం మతం బోధించే పురుష లక్షణం
సంతృప్తితోనే సుఖ, సంతోషాలు
మానసిక ప్రశాంతతలో యోగా పాత్ర
ప్రగతి కోరే వారికి ధైర్యం మంచి నేస్తం
మానవ జీవితంపై గురువు ప్రభావం
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసీ
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace