|
| ఇస్లాం మతం బోధించే పురుష లక్షణం | |
విజయవంతమైన పురుషుడు ఏవిధంగా నడచుకుంటాడో ఇస్లాం మతం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది.
దైవ భక్తి అధికంగా ఉండే ఇస్లామీయుడు సమాజంలో విజయవంతమైన పురుషుడిగా వెలుగొందడమే కాకుండా, ఒక స్త్రీకి మంచి భర్తగా కూడా ఉండగలడు.
భార్య ఆశలను, ఇష్టాలను తెలుసుకుని వాటిని సకాలంలో నెరవేర్చడంతోపాటు, ఆమె ఆశయాలకు అనుగుణంగా నడచుకోవడం భర్తగా పురుషుడి బాధ్యత.
భార్య వద్ద వివేకవంతంగా నడచుకోవాలి. భార్య వద్ద ఏమైన లోటుపాట్లు ఉంటే వాటిని తెలుసుకుని, సర్దుకు పోవలెను. తన తల్లిదండ్రులకు, భార్యకు మధ్య నెలకొనే సమస్యలను మంచి మార్గంలో ఎవరి మనసు నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచి పురుషుడి మొదటి లక్షణం.
కుటుంబంలో అప్పుడప్పుడూ చెలరేగే కల్లోలాల్లో సైతం సంయమనం పాటించి కలతలనుంచి బయటపడగల వాడు మంచి భర్త కాగలడు. ఈ విధంగా నడచుకోవడం వలన ప్రతి పురుషుడు మంచి భర్త కాగలడని ఇస్లాం మతం స్పష్టంగా ప్రబోధిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|