|
| సంతృప్తితోనే సుఖ, సంతోషాలు | | - సంకలనం: గాయత్రి |
| శుక్రవారం, 15 జూన్ 2007 ( 19:50 IST ) |
|
అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు. జీవితంలో సుఖ శాంతులు అందుకునేందుకు సంతృప్తి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. సంతృప్తి అలవరచుకోగలిగితే సముద్రమంత బాధ కలిగినా అది తృణ ప్రాయంగా తోస్తుంది. అయితే దీనిని అలవరచుకోని పక్షంలో ప్రతి చిన్నసమస్య కూడా చాలా పెద్దదిగా కన్పిస్తుంది.
ఓ చీమ బియ్యపు గింజను నోటకరుచుకుని వెళ్తుండగా దారిలో పప్పు దినుసు కనబడింది. దీంతో అది దానిని కూడా తీసుకోవాలని ఆశపడింది. చివరకు రెండిట్లో వేటినీ దక్కించుకోలేక పోయింది. దీనిని మానవ జీవితానికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు.
మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. అయితే ప్రగతిలో మాత్రం సంతృప్తి చెందకూడదు. ఇతరులను చూసి అసూయ పడడం వంటివి తగని చర్యలు. ఇటువంటిని అశాంతికి గురి చేస్తాయి. భగవంతుని ఇష్ట ప్రకారం అంతా జరుగుతుందనేది సత్యం. మన స్థితి గతులను ఆయన నిర్ణయిస్తాడు. అయితే ఇతరులను నొప్పించకుండా సత్య మార్గంలో ప్రగతి సాధించాలి. ఇది అన్ని వేళలా మంచిది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - మనసుకు ప్రశాంతత కలిగించే సాధనాలలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - ప్రతిరోజు క్యారెట్ రసం సేవిస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే బీటా... |
| |
|
|
|
|
|
|
|