|
| క్షమా గుణమే ముక్తికి మార్గం
| |
మనసులో క్షమా గుణాన్ని కలిగివున్నవారు సదా పరుల గురించి మంచే ఆలోచిస్తారు. మనసులో ధైర్యం, జాలి, క్షమ వంటి గుణాలను కలిగి ఉన్న వారు ఎవరినీ ద్వేషించరు. చెడుని కూడా తమ మంచితనంతో మారుస్తారు. దీనికి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఏసు ప్రభువు నిరపరాధి అయినప్పటికీ ఆయనను శిలువపై బంధించి, అన్యాయంగా హింసించారు. ఆ పరిస్థితులలో కూడా తన ధైర్యాన్ని విడవలేదు. అప్పుడు కూడా వారిని ప్రేమించాడే తప్ప ద్వేషించలేదు.
వారికి తమ తప్పు తెలియదని ఆ అజ్ఞానులను క్షమించమని దైవాన్ని వేడిన మహానుభావుడాయన. ధైర్యాన్ని వీడక మంచి మనసుతో నిస్వార్థ ప్రెమను పంచిన ఏసు ప్రభువును ప్రజలు దైవంగా పూజిస్తున్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసే వారిపై దయను చూపడం చాలా గొప్ప విషయం. ఇందుకు ధైర్యం, అపారమైన సహనం కావాలసి ఉంది. కోపాన్ని నియంత్రించి శాంత గుణాన్ని అలవరుచుకోవాలి. ఈ గుణాలు కలిగినవారు యోగులనబడతారు.
వారే ఇతరుల యందు దైవాన్ని చూడగలరు. ఈ క్షమా గుణాన్ని ఇతరులు చేతకానితనంగా భావించరాదు. మనసుకు బాధ కలిగించిన వారిని, అవమానించిన వారిని కూడా క్షమించి ప్రేమించగలిగితే ఈ లోకంలో ఎటువంటి గొడవలూ జరగవు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|