|
| సుఖదు:ఖాలను సమానంగా చూసే వాడే జ్ఞాని
| |
ప్రతి జీవి భగవంతుని స్వరూపం. మానవ జన్మ ఓ వరం. ఈ జీవితం కష్ట సుఖాల వైకుంఠపాళి. అందులో ఎలా అయితే మన పావు చాలా కష్టపడి పై వరకు వెళ్లి పాము నోట్లో పడి కిందకు జారిపోతుందో జీవితం కూడా సుఖాలనుంచి ఉన్నట్టుండి కష్టాలలోకి జారిపోతుంది. ఈ జీవితం ఏ రోజు ఎక్కడ ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు.
అటువంటి జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకుంటూ ముక్తి మార్గాన్ని విడవక దైవాన్ని చేరాలి. కష్టాలను చూసి భయపడేవాళ్లు పిరికివాళ్లు. కాని కష్టాలను కూడా ఇష్టాలుగా చేసుకుని ధైర్యంగా ఎదుర్కొనే వారే ధీరులు. అయితే తమ దు:ఖాన్ని, బాధను తాత్కాలికంగా మర్చి పోవడానికి భగవంతుని చాలా మంది స్మరిస్తారు.
మరి కొంత మంది మద్యం వంటి వాటికి బానిసలవుతారు. సంతోషాన్ని ఏ విధంగా ఆహ్వానిస్తామే అదే విధంగా దు:ఖాన్ని కూడా ఆహ్వానించాలని స్వామి వివేకానంద చెప్పారు. కాని మనుషులు కష్టాలను మాత్రం ద్వేషిస్తూ సంతోషాన్ని ప్రేమిస్తుంటారు. దీంతో అశాంతికి గురవుతుంటారు. దీని గురించి లోతుగా పరిశీలిస్తే కష్ట, సుఖాలనేవి మనసు స్థితికి సంబంధించి ఉంటుందన్న విషయం బోధపడుతుంది.
ఒక సమస్య ఓ మనిషికి చాలా పెద్దదిగా కనిపించొచ్చు కాని అదే సమస్య మరో మనిషికి సర్వ సాధారణంగా కనిపించవచ్చు. అయితే చేదు, తీపి అనుభవాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పొందుతారు. సుఖ దు:ఖాలను సమానంగా చూసిన వారినే జ్ఞానులుగా చెబుతున్నారు.
కష్టకాలం అంధకారం లాంటిది. దానికి దారి దొరకదు. కాలం వాటికి దీపమై దారి చూపుతుంది. అప్పుడు మన అంధకారం తొలగిపోతుంది. అయితే భగవంతుని యందు నమ్మకం, భక్తి, శ్రద్ద ఉంచి పూజిస్తే త్వరలో కష్టాలు తొలగిపోతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|