|
| అష్టైశ్వర్యాలకు లక్ష్మీ కుబేర పూజ | |
నిత్యం సమస్యలతో బాధపడుతూ మనశ్సాంతి కరువైనవారు లక్ష్మి కటాక్షం పొందాలంటే లక్ష్మి కుబేర పూజను తప్పని సరిగా చేయాలి. ఈ పూజను అధిక భక్తి శ్రద్దలతో చేస్తే అమ్మవారి కృపకు పాత్రులవ్వచ్చు. ముందుగా పూజా గది లేదా వంట గదిని శుభ్రంచేసి పెట్టుకోవాలి. అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని అమర్చి కుంకుమతో అలంకరించాలి.
పద్మావతి రూపమైన మహాలక్ష్మిని పూలమాలతో అలంకరించాలి. దేవికి తామర ఇష్టమైన పుష్పం కనుక తామర రేకలతో, పుష్పాలతో అలంకరించాలి. దీని దగ్గర్లోనే కుబేరుని విగ్రహం లేదా చిత్ర పటాన్ని పెట్టాలి. ఎదురుగా పద్మపు రంగవల్లులను దిద్దాలి. దీనిని బియ్యపు పిండితోనే వేయాలి. రంగవల్లుల మధ్యలో పూవులు, కుంకుమ, పసుపులతో అలంకరించాలి.
తర్వాత గుండ్రంగా ఉన్న ఇత్తడి లేక వెండి పాత్రను పెట్టి దానిపై పసుపు కొమ్ము, లక్ష్మి రూపు, లక్ష్మి విగ్రహం, కుబేర రూపులను పెట్టాలి. పూవులతోను, రెండు వైపులా పెద్ద దీప కుందులను వెలిగించి అలంకరించాలి. తర్వాత విఘ్నేశ్వరుని ప్రార్థనతో పూజను ప్రారంభించాలి. లక్ష్మి, దుర్గా, సరస్వతి దేవి విగ్రహాలకు విడివిడిగా కుంకుమతో అష్టోత్తర శతనామావళి చేయాలి.
ఇది పూర్తయ్యాక కుబేరునికి నమస్కరించి కుబేర అష్టోత్తరాన్ని కూడా జపించాలి. నూటెనిమిది కుబేర రూపులను పళ్లెంలో పెట్టి కుంకుమతో అర్చించి తర్వాత తీసి పాలతో శుభ్రం చేసుకుని మరొక సారి ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి కాయను కొట్టి, అరటి పళ్లను, కొబ్బరిని నైవేద్యం పెట్టాలి. కర్పూర హారతినిచ్చి పాలతో పాయసాన్ని చేసి నైవేద్యం పెట్టాలి.
తర్వాత కృష్ణార్పణమస్తు అని పలికి పూజను ముగించాలి. స్తోమత ఉంటే ముత్తైదువుకు చీర, రవిక, రూపాయి బిళ్ల, పసుపు కుంకుమ, పూవులతో తాంబూలమివ్వాలి. సాయంకాల సమయాన దీపం వెలిగించి, హారతిచ్చి పూజలో పెట్టిన నాణాలను ధన పెట్టెలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|