|
| జీవితం సుఖ:దుఖాల సంగమం | |
జీవితం గురించి ఎంతో మంది తత్వవేత్తలు ఎన్నో నిర్వచనాలు చెప్పారు. వాటిలోని సారం ఒకటే జీవితం అస్థిరమైనది, ఈ భౌతికసుఖాలు అశాశ్వతం. వీటిని తెలుసుకోలేక మానవుడు మాయలో పడి కొట్టుమిట్టాడుతుంటాడు.
ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా నిర్వర్తించాలి. మానవుడు భవిష్యత్తు గురించి అవాస్తవిక కలలు కంటూ సమయాన్ని వృధా చేస్తుంటాడు. వాటి కోసం కేటాయించే సమయాన్ని ఆ కలలను నిజం చేసుకునేందుకు కేటాయిస్తే జీవితం సార్థకమవుతుంది. జీవితంలో సుఖ:దుఖాలు పగలు రేయి వంటివి ఎప్పుడూ పగలే ఉంటే విరక్తి వస్తుంది.
అలాగే రాత్రి కూడా. కనుకనే జీవితాన్ని సుఖ:దుఖాల సంగమంగా మలచాడు భగవంతుడు. మానవుడు నిజజీవితంలోని సుఖ:దుఖాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగినప్పుడే జీవితంలో నిజమైన సంతోషం. కానీ కోపానికి గురై తమ కర్తవ్యాన్ని మరచి అశాంతికి లోనవుతున్నారు.
ఈ కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతో అవసరం. ఆలోచనా శక్తిని హరించే ఈ కోపంతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున దీనిని అణచివేయాలి. క్రోధం అగ్నికన్నా ప్రమాదమైంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
యుధ్దం చేయాలనుకుంటే అంతరాత్మతో చేయాలి. చేసే పని చిత్తశుద్దిగా లేనప్పుడు ఇతరులకు ఎలా సహాయపడగలం. భగవంతుని పూజించేవాడు ఆయన భోదనలను, సిధ్దాంతాలను కూడా పాటించాలి. అశాశ్వతపు, అస్థిరమైన సుఖాలలో పడి మానవుడు భ్రష్టుపట్టిపోతున్నాడు.
కరిగిపోయిన రోజులు, సమయం తిరిగి రాలేవు. అనవసర ప్రలోభాలలో పడి బాహ్య ప్రపంచమే సర్వమని తలచి చేసిన పాపాలను ఇకనైనా వీడి మంచి మనసుతో పరులకు సహాయం చేసి దేవుని చేరేందుకు ప్రయత్నించాలి. నిరాశ, నిస్పృహలతో ఇంత వరకూ ఎంతో కాలాన్ని వృదా చేశాం. లక్ష్య సాధన కోసం సమయాన్ని వినియోగిస్తూ ముక్తి మార్గాన్ని చేరాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|