|
| సృష్టి కర్తగా బ్రహ్మదేవుని స్థానంలో హనుమాన్ | |
రాముని చేత 108 ఉపనిషత్తుల ఉపదేశం పొందిన వాయుపుత్ర హనుమాన్ కలియుగ క్షీణానంతరం ప్రపంచ సృష్టి కర్తగా ప్రసిద్ధి కాగలరని అనేక పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మదేవునికి సృష్టి కర్త అనే పేరు గల సంగతి విదితమే. ఈ తరుణంలో హనుమంతుడికి సృష్టికర్తగా ప్రపంచాన్నిసృష్టించగల శక్తి గలదనే పురాణం తెలిపే సంగతుల కెళితే.. హనుమంతుని జనన కాలంలో సూర్య గ్రహణ సమయంలో, సూర్యుడిని రాహువు మింగబోవు తరుణంలో సూర్యుడిని పండుగా భావించి హనుమంతుడు మింగబోయిన శక్తికి భీతిచెందటంతోపాటు, తమ కర్తవ్యాన్ని చేయబూనలేదని రాహువు ఇంద్రునితో మొరపెట్టుకొనెను.
దీంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని దవడ మీద కొట్టడంతో ఆంజనేయులనే నామము హనుమంతునికి సార్థకమైంది. మహాభారత కురు క్ష్రేత్రయుద్ధంలో, యుద్ధం ముగిసిన పిమ్మట రథం నుండి మొదట రథసారథి దిగటం పరిపాటి. అయితే అర్జునుడికి రథసారథియైన శ్రీ కృష్ణుడు తాను మునుపు దిగక అర్జునుడిని రథం నుంచి దిగమనెను. ఈ పద్ధతి యుద్ధనీతికి వ్యతిరేకమైనప్పటికీ, శ్రీకృష్ణుడి మాటను శిరసావహించి అర్జునుడు రథం నుంచి దిగిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా దిగుతాడు. ఆ నిముషానికే రథం పేలుతుంది.
ఈ విషయానికి అర్థం తోచని అర్జునుడితో శ్రీకృష్ణుడు....రామదాసుడైన హనుమంతుడు రాముని అవతారమైన నాకు 18 రోజులు కురుక్ష్రేత్ర యుద్ధ సమయంలో రక్షగా ఉన్నాడని, రధాన్ని కూల్చటానికి వచ్చిన అస్ర్తాన్ని శ్రీకృష్ణుడు దిగే వరకు నిరోధించినట్టు తెలిపాడు. అందుచేత అర్జునుని తొలుత దిగమన్నాడనే అర్ధం అర్జునునికి స్పురింపజేశాడు. హనుమంతుడు రామభక్తుడు మాత్రమే కాదని అతడు శివభక్తుడని కూడా పురాణాలు తెలుపుతున్నాయి.
ఇంతే గాక పరమశివుడు అతని త్రినేత్రాన్ని హనుమంతునికి ఒసగినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మచారులు మాత్రమే హనుమంతుని పూజించాలనే నినాదం లేదు. అతనిని సంసారులు సైతం పూజించవచ్చునని.. అందులకు చక్కని ఉదాహరణగా రామచరితను గ్రహింపవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. రావణుని చేత వీడిన సీతారాములను మరల అయోధ్యకు పట్టాభిషిక్తులను చేయటానికి ముఖ్య కారకుడు హనుమంతుడేనన్న విషయం విదితిమే.
అందుచేత హనుమంతున్ని అందరూ పూజించడం ద్వారా తమ సమస్యలనుంచి విముక్తి పొందవచ్చు. రామభజన , రామనామస్మరణ, రామచరిత కార్యాలు జరుగు ప్రదేశాల్లో భక్తులతో భక్తునిగా రామస్మరణ చేస్తాడన్నది పురాణ సారాంశం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|