|
| పంచామృత అభిషేకంతో సిరిసంపదలు | |
దేవతలకు అభిషేకాలు హిందూ సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారం. తద్వారా ఎన్నో శుభ పరిణామాలు, శుభ కార్యాలు సంభవిస్తాయనేది మన పెద్దల నమ్మకం. దీనిని బహుశా ఎవరూ కాదనలేరేమో. ఏ దేవునికి ఏ రకమైన అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అభిషేకం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం.
స్వచ్ఛమైన నీటితో అభిషేకిస్తే మన కోరికలు నెరవేరుతాయి. అలాగే నువ్వుల నూనెతో అభిషేకిస్తే మన జీవితం కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటుంది. పంచామృతంతో అభిషేకిస్తే అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో పాటు సిరిసంపదలు కూడా సమకూరుతాయి.
ఆవు పాలతో అభిషేకిస్తే సంతాన వృద్ధి చెంది కుటుంబ ఆరోగ్యం కలుగుతుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం కలిపిన వాటితో అభిషేకిస్తే పాప విముక్తి కలుగుతుంది. అరటి పండుతో అభిషేకిస్తే పంట బాగా పండి మంచి పంట చేతికొస్తుంది.
అన్నంతో అభిషేకిస్తే రాజ భోగం అనుభవించే జీవితం లభిస్తుంది. గంధంతో అభిషేకిస్తే అన్ని రకాల సిరి సంపదలను పొందవచ్చు. ఏ పదార్ధాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకున్నట్లే ఏ ఏ రోజులు చేయాలో కూడా తెలుసుకోవాలి.
ఆదివారం వినాయకునికి, నవగ్రహాలకు, సోమవారం శివునికి అభిషేకం చేయాలి. మంగళ, బుధ, గురువారాలలో కుమార స్వామి, విష్ణు, దక్షిణామూర్తులకు చేయాలి. శుక్రవారం అమ్మవారికి, శనివారం శ్రీ మహా విష్ణువుకు ఆయన అవతారాలకు చేయాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|