యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
కోరిన వరాలిచ్చే వరసిద్ధి వినాయకుడు
- సంకలనం: గాయత్రి
సకల విఘ్నాలను తొలగించి తలచిన కార్యాలను నెరవేర్చే వినాయకునికి విఘ్నేశ్వరుడని కూడా పేరు కలదు. అందుకే ఏ పని ప్రారంభంలోనైనా ముందు మూషిక వాహణుణ్ని కొలుస్తారు. మూషికాన్ని వాహనంగా చేసుకుని కోరిన వరాలిస్తూ భక్తులను కాపాడుతూ వరసిద్ధి వినాయకుడిగా పేరుగాంచాడు.

తన భక్తులకు సిరి సంపదలను, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు బొజ్జ గణపతి. మంగళవారం, శనివారం వినాయకునికి ప్రీతికరమైన రోజులు. ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్లు చేసి నైవేధ్యం పెట్టాలి. ఎరుపు, పసుపు రంగుల శంఖు పూలతో పూజిస్తే మంచిది. శుక్ల చతుర్థి నాడు వినాయకుని గరికతో పూజించిన వారికి విజయం సిద్ధిస్తుంది.

పసుపుతో వినాయకుడిని చేసి ఇత్తడి పాత్రలో మూసి పెట్టి 48 రోజులు పూజిస్తే వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబంలోని కష్టాలు తొలగిపోయి సిరి సంపదలతో కళకళలాడుతారు. నవగ్రహ దోషాలు, పీడలున్నవారు వినాయకుని వెనుక భాగమున నెయ్యితో దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయి.

శుక్ల చతుర్థి నాడు పిల్లల పేరున పూజ చేయించి 11 మంది పేద పిల్లలకు నోట్ బుక్కులు, పెన్సిళ్లు, స్వీట్లు పంచిపెడితే ఆ ఇంటి పిల్లలకు విద్యా జ్ఞానం వృద్ధి చెందుతుంది. విజ్ఞానికి మారు పేరుగా గణపతిని పూజిస్తారు. వినాయక చవితి నాడు కొత్త విగ్రహాల కింద పాఠ్య పుస్తకాలను పెట్టడం ఆనవాయితి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్షమా గుణమే ముక్తికి మార్గం
సుఖదు:ఖాలను సమానంగా చూసే వాడే జ్ఞాని
అష్టైశ్వర్యాలకు లక్ష్మీ కుబేర పూజ
జీవితం సుఖ:దుఖాల సంగమం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace