|
| వడై కర్రీ | |
కావలసిన పదార్ధాలు:
300గ్రాముల మినపప్పు, నాలుగు ఉల్లిపాయలు, అంగుళం ముక్క అల్లం, ఐదు ఎండుమిరపకాయలు, ఐదు పచ్చిమిర్చి, అరస్పూన్ గరం మసాలా పొడి, ఓ వెల్లుల్లి పాయ, పావు కప్పు వేయించిన శెనగపప్పు, 6 టమోటాలు, తగినంత ఉప్పు, నూనె, కొద్దిగా కొత్తిమీర.
తయారుచేయు విధానం:
ముందుగా మినపప్పును మూడు గంటలు నానబెట్టి బాగా కడిగి గారెల పిండిలాగ రుబ్బుకోవాలి. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు కలిపాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న గారెల మాదిరి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
అల్లం, వెల్లుల్లి, గరం మసాలాలను కలిపి ముద్ద నూరుకోవాలి. ఓ గిన్నెలో పావుకప్పు నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగాక మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి.
అందులో టమోటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు గారెలను వేసి తగినంత ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
వేడివేడిగా రోటీతో గానీ దోసెలతో గానీ సర్వ్ చేయాలి. అన్నంలోకి కూడా బాగుంటుంది. గ్రేవీ చిక్కబడాలంటే టమోటాలకు బదులు పెరుగు కూడా వాడచ్చు.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|