|
| గ్రీన్ చిల్లీ కర్రీ | |
కావలసిన పదార్ధాలు: పది పెద్ద సైజు మిరపకాయలు, కప్పు నువ్వులపప్పు, అరకప్పు ఎండుకొబ్బరి, 25 గ్రాముల గసగసాలు, టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ మెంతులు, చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు.
తయారుచేయు విధానం: ముందుగా పచ్చిమిరపకాయలను తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులపప్పు, ఎండుకొబ్బరి, గసగసాలను దోరగా వేయించి ముద్దగా రుబ్బుకోవాలి.
ఓ బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, మెంతులు వేసి పోపు పెట్టాలి. పోపు వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసి ఐదు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత అదే బాణలిలో మరికొద్ది నూనె వేసి కాగాక నూరిన మసాలా ముద్దను వేసి దోరగా వేయించాలి. వేగాక తగినంత పసుపు, చింతపండు రసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలను కూడా అందులో వేసి కాసేపు వేయించాలి. వేడివేడిగా అన్నంతో సర్వ్ చేయాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలి పాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|