యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు శాకాహారం
హరా ధనియా విత్ ఆలూ
- గోపాలకృష్ణమ్మ
కావలసిన పదార్థాలు:
పావుకేజీ బేబి ఆలు, రెండు కట్టల కొత్తిమీర, ఐదు పచ్చిమిరపకాయలు, రెండు చెంచాల అల్లంవెల్లుల్లి ముద్ద, అర చెంచా జీలక్రరపొడి, తగినంత ఉప్పు, ఓ చెక్క నిమ్మకాయ, చిటికెడు పసుపు, రెండు టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, నూనె - తగినంత.

తయారుచేయు విధానం:
ముందుగా బేబీ ఆలూలను చెక్కు తీసి నిలువుగా రెండు గాట్లు పెట్టి నూనెలో ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్‌లను వేసి మెత్తగా నూరి నిమ్మరసం పిండాలి. బాణలిలో నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.

పచ్చి వాసన పోయిన తర్వాత ఆలూలను కూడా వేసి తగినంత ఉప్పు, పసుపును వేసి సన్నని మంటలో పెట్టి ఐదు నిమిషాలు వేయించి కొత్తిమీర ముద్దను కూడా వేసి బాగా కలిపి దించాలి. వేడి వేడిగా రోటీతో సర్వ్ చేయాలి.

తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆలూ కోకోనట్ కర్రీ
వంకాయ పులావ్
మసాలా రైస్
మామిడి కాయ పచ్చడి
మామిడి కాయ పచ్చడి
వడై కర్రీ
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace