యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు శాకాహారం
ఆలూ కోకోనట్ కర్రీ
- గోపాలకృష్ణమ్మ
కావలసిన పదార్థాలు:
పది బంగాళాదుంపలు, నాలుగు పెద్ద ఉల్లిపాయలు, పది పచ్చిమిరపకాయలు, కప్పు కొబ్బరి పాలు, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద, ఓ చెంచా గరం మసాలా పొడి, చెంచా ధనియాల పొడి, 6 లవంగాలు, 5 గ్రాముల దాల్చిన చెక్క, మూడు యాలికలు, చెంచాడు మిరియాలు, టీస్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, టీస్పూన్ సోంపు, కొద్దిగా కరివేపాకు.

తయారుచేయు విధానం:
ముందుగా బంగాళాదుంపలను ఉడకపెట్టి తోలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, జీలకర్రలను సన్నని మంటపై వేయించి తీసి పొడి చేసుకోవాలి.

తర్వాత ఓ గిన్నెలో నూనె వేసి కాగాక ఉడికించిన బంగాళాదుంప, ఉల్లిపాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి పాలను పోసి, తగినంత ఉప్పు కలిపి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తర్వాత మసాలాపొడి వేసి కలిపి ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వంకాయ పులావ్
మసాలా రైస్
మామిడి కాయ పచ్చడి
మామిడి కాయ పచ్చడి
వడై కర్రీ
గ్రీన్ చిల్లీ కర్రీ
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace