యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు శాకాహారం
మామిడి కాయ పచ్చడి
- గోపాలకృష్ణమ్మ
కావలసిన పదార్థాలు:
ఓ పుల్లని మామిడి కాయ, కప్పు కొబ్బరితురుము, నాలుగు పచ్చిమిరపకాయలు, 25 గ్రాముల పచ్చిశనగ పప్పు, కొద్దిగా మెంతులు, చిటికెడు ఇంగువ, టీస్పూన్ ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, 25 గ్రాముల నూనె, తగినంత ఉప్పు.

తయారుచేయు విధానం:
ముందుగా పచ్చిశనగ పప్పును వేయించి, మామిడికాయను తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించాలి.

అందులో మామిడి తురుము కూడా వేసి కాసేపు వేగాక తగినంత ఉప్పు వేసి, వేయించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో కొత్తిమీర వేసి పోపు పెట్టి అన్నం లేదా దోసతో సర్వ్ చేయాలి.

తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace