|
| వంకాయ పులావ్ | |
కావలసిన పదార్ధాలు: పావుకేజీ బాసుమతి రైస్, నాలుగు గుండ్రటి వంకాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, పది పచ్చిమిర్చి,రెండు క్యారెట్, అరకప్పు కొబ్బరి తురుము, పావు కప్పు నెయ్యి, ఓ చెంచా గరం మసాలా పొడి, టీ స్పూన్ జీలకర్ర, 10 గ్రాముల జీడిపప్పు, తగినంత ఉప్పు,కారం.
తయారు చేయు విధానం ముందుగా బాసుమతి బియ్యాన్ని బాగా కడిగి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఓ బాణలిలో నెయ్యివేసి కాగాక అందులో జీలకర్ర, కారం, గరం మసాలా పొడి వేసి కొద్ది సేపు వేయించాలి.
తర్వాత అందులో ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ ముక్కలను వేసి వేయించాలి. చివరగా కొబ్బరితురుము వేసి దోరగా వేగాక తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|