|
| ఫ్రూట్ కేక్ | |
కావలసిన పదార్థాలు: పావుకేజీ మైదా పిండి, టీస్పూన్ షాజీరా,దాల్చినచెక్క పొడి, 150 గ్రాముల బేకింగ్ పౌడర్, 50 గ్రాముల షుగర్ కారమిల్, చిటికెడు ఉప్పు, అరకప్పు పాలు, 50 గ్రాముల చెర్రీలు, 150 గ్రాములు కిస్‌మిస్, 100 గ్రాముల జీడిపప్పు, 100 గ్రాముల టూటీ ఫ్రూటీ, నాలుగు కోడి గుడ్లు, 10 చుక్కల వెనీలా ఎసెన్స్.
తయారు చేయు విధానం: కేక్ తయారు చేయాలనుకుంటున్న పాత్రకు వెన్న రాసి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా కలిపి క్రీమ్ తయారుచేసుకోవాలి. షుగర్ కారమిల్‌ను కూడా దానిలో కలిపి నురుగు వచ్చేలాగ కలపాలి.
అందులో గిలకొట్టిన కోడి గుడ్లను కూడా వేసి బాగా కలపాలి. పూర్తిగా కలిపాక అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మిశ్రమం పూర్తిగా కలిసే వరకు గరిటెతో బాగా మెత్తగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో ముక్కలు చేసిన డ్రైఫ్రూట్స్, పాలు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఈ పిండిని ముందుగా సిద్ధం చేసుకున్న గిన్నెలో వేసి గిన్నె మొత్తం సమానంగా పరచాలి. ఈ పాత్రను ఓవెన్‌లో పెట్టి 160 డిగ్రీల సెంటీ గ్రేడ్‌లో ఓ గంట పాటు బేక్ చేయాలి.
శ్రీమతి రాజ్యలక్ష్మి ఆంధ్రప్రదేశ్ చీరాలకు చెందిన గృహిణి. ఆమె ఇంటర్మీడియట్ (బైపీసీ) వరకు చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలు తయారుచేయడం ఆమె అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని మాధవరంలో నివశిస్తున్న ఆమె ఆసక్తి కలిగిన వారికి కుకరీ క్లాసెస్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన వంటకాలకు సంబంధించిన వివరాలను యాహూ తెలుగుకు అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|