|
| మటన్ ఫ్రై
| |
కావలసిన పదార్థాలు మటన్ - 200గ్రా, బ్రెడ్ - 8స్లయిస్లు, పెద్ద ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి - 100గ్రా, గుడ్లు - రెండు, నూనె - అర లీటర్.
తయారు చేయు విధానం ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మటన్‌ను శుభ్రం చేసి ఎముకలను తీసి మిక్సీలో వేసి నూరాలి. ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి, ఉల్లిలను వేయించి వేయాలి. ఇందులో గుడ్డును పగుల గొట్టి వేసి తగినంత ఉప్పును వేసి కలపాలి. బ్రెడ్ స్లయిస్‌ను తీసుకుని దానిపై దీనిని పూయాలి. తర్వాత దానిపై వెల్లుల్లిని వేసి నూనెలో వేయించాలి. దీనిని రెండుగా కట్ చేసి సర్వ్ చేయాలి. దీనిని టమాటా సాస్‌తో సర్వ్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|