|
| పెప్పర్ చికెన్ | |
కావలసిన పదార్థాలు చికెన్ - అర కిలో, మిరియాలు - అర టీస్పూన్, నూనె - 100మిల్లీ, అల్లం - 10గ్రా, వెల్లుల్లి - 10గ్రా, చిన్న ఉల్లిపాయ - 100గ్రా, ఉప్పు - తగినంత, నీరు - సరిపడ.
తయారు చేయు విధానం మిరియాలు, సోంపు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరుకోవాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. దీంట్లో నూరిన మసాలాను వేసి కలపాలి. దీంట్లో చికెన్ వేసి తగినంత ఉప్పును వేసి రెండు నిమిషాలు కలపాలి. వీటికి సరిపడ నీటిని పోసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ఉడికాక నీరు ఇంకేంత వరకూ ఉంచి దించాలి.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|