|
| చికెన్ ఫ్రైడ్ రోల్స్
| |
కావలసిన పదార్థాలు చికెన్ - 100గ్రా, మైదా పిండి - పావు కిలో, గుడ్డు - ఒకటి, క్యాబేజి - 25గ్రా, బీన్స్ -25గ్రా, క్యారెట్ - 25గ్రా, కారం - అర స్పూన్, నూనె - అర లీటర్, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి. ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్‌ను ఉడకబెట్టుకోవాలి. కూరలను, చికెన్‌ను సన్నని పొడుగాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్, క్యాబేజి, క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్‌ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి. తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. కాగిన నూనెలో ఎర్రగా వేయించి దించాలి.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|