|
| మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీ | |
కావలసిన పదార్ధాలు: ఓ కప్పు కాలీఫ్లవర్ పువ్వులు, కప్పు క్యాప్సికమ్ ముక్కలు ,కప్పు క్యాబేజీ ముక్కలు, కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, రెండు కప్పుల టమోటా గుజ్జు, అర కప్పు టమోటా సాస్, రెండు చెంచాల కార్న్‌ఫ్లోర్, 100గ్రాములు సన్నగా తురిమిన జున్ను, ఐదు టేబుల్ స్పూన్స్ వెన్న, రెండు కప్పుల పాలు, ఓ టీస్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు.
తయారీ విధానం: ముందుగా కాలీఫ్లవర్ పువ్వులు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నిటినీ నీటిలో వేసి పది నిమిషాలు ఉడకపెట్టాలి. ఓ బాణలిలో రెండు చెంచాల వెన్న వేసి పూర్తిగా కరగనివ్వాలి. తర్వాత అందులో కార్న్‌ఫ్లోర్ వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
అందులో పాలను పోసి చిక్కబడేంత వరకు కలుపుతూ మరగపెట్టాలి. చిక్కబడ్డాక స్టవ్‌పైనుంచి దించి మిశ్రమాన్ని ఓ పళ్లెంలో వేసి పూర్తిగా చల్లారాక దానికి ఉడకపెట్టిన కూరగాయ ముక్కల్ని, సగం ఛీజ్‌ను చేర్చాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని అడుగు మందం గల గిన్నెలోకి మార్చి దానికి టమోటా గుజ్జు, టమోటా సాస్‌లను చేర్చి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న వేసి, మిగిలిన ఛీజ్‌ను కూడా చేర్చి పావుగంట ఉడకనిచ్చి వేడివేడిగా సర్వ్ చేయాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|