|
| ఆల్మండ్ సూప్ | |
కావలసిన పదార్ధాలు: అరకప్పు క్యాబేజీ ముక్కలు, కప్పు టమోటా ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బంగాళా దుంప ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు బీన్స్, కప్పు బాదం పప్పు, కప్పు పాలు, టీస్పూన్ మిరియాలపొడి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, కొన్ని చుక్కల బాదం ఎసెన్స్, తగినంత ఉప్పు.
తయారీ విధానం: కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని వాటికి మూడున్నర కప్పుల నీటిని చేర్చి ఉడికించాలి. నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పును సన్నగా కట్ చేసుకుని పాలతో కలిపి మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే బాదంపాలు తయారవుతాయి.
ఇప్పుడు బాదం పాలను, వడకట్టిన కూరగాయల నీటిని ఉప్పు, మిరియాల పొడితో కలిపి ఉడికించాలి. కార్న్‌ఫ్లోర్‌ను తగినన్ని నీటితో కలుపుకోవాలి. ఈ లిక్విడ్‌ను ఉడుకుతున్న సూప్‌లో కొద్దికొద్దిగా వేస్తూ మిశ్రమం చిక్కబడేంతవరకు కలపాలి. సర్వ్ చేసే ముందు తరిగిన బాదం పప్పు ముక్కల్ని, బాదం ఎసెన్స్‌ని పైన చల్లాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|