|
| వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పీటర్సన్ దూరం |
| లీడ్స్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009 ( 12:55 IST ) | |
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వెస్టిండీస్‌తో జరిగే నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కాలి మడమ గాయంతో కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్- వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు పూర్తిగా అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లాండ్- వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో తొలి మ్యాచ్ గురువారం హేడింగ్లీలో జరుగుతుంది. ప్రస్తుత సిరీస్‌కు గాయం కారణంగా పీటర్సన్‌కు విశ్రాంతి కల్పించడం జరిగిందని, దీని ద్వారా వచ్చే నెలలో స్వదేశంలో జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్‌కు, ఆ తరువాత జరిగే యాషెస్ సిరీస్‌కు అతను పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటాడని ఈసీబీ పేర్కొంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|