యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఉత్కంఠభరిత పోరులో చెన్నైదే విజయం
డర్బన్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 09:28 IST )
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాన్ని సాధించింది. చెన్నై విధించిన 117 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో 92 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ జట్టు తన సెమీస్ అవకాశాలను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (32), రైనా (20), ఓరమ్ (17)లు మాత్రమే ఓ మోస్తరు స్కోరు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 9 వికెట్లను నష్టపోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ దశలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ జట్టు ప్రారంభంనుంచి మంచి భాగస్వామ్యాలను నమోదు చేయడంలో విఫలమైంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ జట్టులో పొమెర్స్‌బాచ్ (26), ఇర్ఫాన్ పఠాన్ (14)లు మాత్రమే ఓ మోస్తరుగా ఆడగా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. పంజాబ్ ఓటమితో చెన్నై జట్టు సెమీస్ చేరుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజస్థాన్ రాయల్స్ సెమీస్ ఆశలు గల్లంతు
ఐపీఎల్: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102
దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటు
రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్
అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్
క్వాలిఫైయింగ్ ఈవెంట్: రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...