|
| రాజస్థాన్ రాయల్స్ సెమీస్ ఆశలు గల్లంతు |
| డర్బన్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009 ( 09:01 IST ) | |
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సెమీస్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవిచూసింది. తద్వారా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. డర్బన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోవడం ద్వారా రాజస్థాన్ జట్టుకు ఈ పరిస్థితి దాపురించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు భారీస్కోరు సాధించడంలో విఫలమైంది. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్‌మెన్ చేసిన అనవసర తప్పిదాలు రాజస్థాన్‌ను వెంటాడాయి. దీనికి తోడు లాంగ్‌వెల్డ్ 3, అగార్కర్ 2 వికెట్లు పడగొట్టడం ద్వారా రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో రాజస్థాన్ జట్టు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఈ నేపథ్యంలో 102 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం ప్రారంభంలో తడబడింది. అయితే శుక్లా (48 నాటౌట్) జాగ్రత్తగా ఆడి కోల్‌కతాను విజయ తీరాలు చేర్చారు. దీంతో 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసిన నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది.
ఈ విజయం ద్వారా ఐపీఎల్ రెండో సీజన్‌లో మరో మ్యాచ్ గెలిచామన్న సంతృప్తి తప్ప నైట్‌రైడర్స్‌కు ప్రత్యేకంగా లాభించేదేమీ లేకున్నా రాజస్థాన్‌కు మాత్రం సెమీస్ ఆశలు అడియాశలు కావడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|