|
| దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటు |
| కరాచీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 17:31 IST ) | |
పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ యూసఫ్ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అతనితోపాటు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన ఇతర పాక్ ఆటగాళ్లు తమ తమ ప్రాంతీయ జట్లలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
పాకిస్థాన్ జాతీయ ట్వంటీ-20 టోర్నమెంట్ సోమవారం లాహోర్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 13 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లలో ఎందులోనూ యూసఫ్‌కు చోటు కల్పించలేదు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగబోతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లకు ఈ టోర్నీ ద్వారా ప్రాక్టీసు లభించనుంది.
గత ఏడాది ఐసీఎల్‌లో చేరుకముందు వరకు యూసఫ్‌కు లాహోర్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. ఈసారి మాత్రం ప్రాంతీయ సెలెక్టర్లు యూసఫ్‌కు మొండిచెయ్యి చూపించడం గమనార్హం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీఎల్‌తో సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లను దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|