యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్
ప్రిటోరియా (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 17:25 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో చివరి మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగైదు జట్లను సెమీస్ చోటు ఊరిస్తుండటంతో అన్ని జట్లు తరువాతి దశకు చేరుకునేందుకు అమీతుమీకు సిద్ధమయ్యాయి. డెక్కన్ ఛార్జర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య గురువారం ఇక్కడ మరో కీలక మ్యాచ్ జరగబోతుంది.

ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రెండు జట్లను సెమీస్ చోటు ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్. రెండు జట్ల ఖాతాలోనూ చెరో 14 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

తొలి సీజన్‌లో ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాలకు పరిమితమయ్యాయి. అయితే ఈ సీజన్‌లో మాత్రం బాగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెమీస్ చోటు కోసం పోటీ పడుతున్నాయి. రెండో సీజన్‌ను వరుస విజయాలతో ప్రారంభించిన డెక్కన్ ఛార్జర్స్ లీగ్ దశ సగానికి వచ్చేసరికి చతికిలపడింది. అయితే తిరిగి పుంజుకున్న ఆ జట్టును సెమీస్ చోటు ఊరిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్
క్వాలిఫైయింగ్ ఈవెంట్: రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...