|
| అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్ |
| కరాచీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 13:33 IST ) | |
త్వరలో జరగబోయే ట్వంటీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఫిటినెస్ నిరూపించుకోవాలని పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు ఆ దేశ క్రికెట్ కోచ్ ఇంతిఖాబ్ ఆలం సూచించారు. అక్తర్ గజ్జల్లో గాయం కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించిన కండిషనింగ్ క్యాంపుకు దూరమైన సంగతి తెలిసిందే.
దీనికి దూరమైన కారణంగా ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు వెళ్లేందుకు అక్తర్ ట్వంటీ- 20 ప్రాక్టీసు మ్యాచ్‌లు, జాతీయ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని పేర్కొన్నారు. అక్తర్ ఫిట్‌నెస్ పరిశీలనలో ఉంది. అందువలన మూడు ప్రాక్టీసు మ్యాచ్‌లు, అనంతరం జరిగే జాతీయ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌ను అక్తర్ ఆడాల్సి ఉంటుందని ఆలం విలేకరులతో చెప్పారు.
ఈ మ్యాచ్‌ల్లో అతని ఆడకపోతే ప్రపంచకప్‌కు వెళ్లేందుకు అతనికి సమస్యలు ఎదురవతాయని తెలిపారు. అక్తర్ కండిషనింగ్ క్యాంపుకు హాజరుకానందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అసంతృప్తితో ఉంది. ఈ క్యాంపుకు హాజరుకాలేకపోతున్నందుకు అక్తర్ ప్రైవేట్ వైద్యుడిని సంప్రదించి మెడికల్ రిపోర్టు అందజేయడం బోర్డుకు ఆగ్రహం తెప్పించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|