యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
క్వాలిఫైయింగ్ ఈవెంట్: రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
పారీస్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 13:34 IST )
ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో భారత సంచలనం సోమ్‌దేవ్ దేవ్‌వర్మ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బ్రెజిల్ ఆటగాడు జోవో సౌజాను చిత్తు చేయడం ద్వారా సోమ్‌దేవ్ ఈ ఘనత సాధించాడు.

ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఆడడం కోసం పోటీపడుతున్న సోమ్‌దేవ్ మంగళవారం రాత్రి 2 గంటల 27 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో భాగంగా 6-2, 2-6, 7-5 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో లభించిన విజయంతో సోమ్‌దేవ్ తన తర్వాతి మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన అలెక్స్ బొగ్డానోవిక్‌తో తలపడనున్నాడు.

అంతకుముందు ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్‌లో భాగంగా అమెరికాకు చెందిన రైలెర్‌ను 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించడం ద్వారా అలెక్స్ బొగ్డానోవిక్ తన తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. అదేసమయంలో ఈ క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో భాగంగా భారత్‌కు చెందిన ప్రకాష్ అమృతరాజ్ తన తొలిరౌండ్ మ్యాచ్‌లో బ్రెజిల్ క్రీడాకారుడు మార్కోస్ డేనియల్ చేతిలో ఓడిపోవడం ద్వారా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్‌కలమ్
మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...