యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
సిడ్నీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 12:44 IST )
ఇంగ్లాండ్‌తో జరిగే ఈ ఏడాది యాషెస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా వివాదాస్పద ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్‌కు మొండిచెయ్యి చూపింది. క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం యాషెస్ సిరీస్ కోసం ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించింది. ఈ బృందంలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు.

వీరిలో ఆల్‌రౌండర్లు షేన్ వాట్సన్, ఆండ్ర్యూ మెక్‌డొనాల్డ్, మార్కస్ నార్త్‌లకు చోటు కల్పించి, చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సైమండ్స్ (34)కు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా పక్కనబెట్టింది. ఆస్ట్రేలియా తరపున 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సైమండ్స్ గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తరువాత జట్టుకు దూరమయ్యాడు.

అనంతరం గాయం, పేలవమైన ప్రదర్శన, మైదానం బయట వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ సైమండ్స్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. యాషెస్‌కు జట్టు ఎంపిక చేయడం సెలెక్టర్లకు చాలా కష్టంగా మారింది. దురదృష్టవశాత్తూ ఈసారి సైమండ్స్‌కు చోటుకల్పించలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్‌కలమ్
మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?
సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...