యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
జోహెన్స్‌బర్గ్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 11:08 IST )
కలిస్ (58 నాటౌట్), ద్రావిడ్‌ (38)లు రాణించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బలమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుపై బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. బెంగుళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన కలిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు విఫలమవడానికి తోడు మిగిలిన బ్యాట్స్‌మెన్ సైతం విఫలం కావడంతో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగలేకపోయింది. దినేశ్ కార్తీక్ (31) మాత్రమే ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగుళూరు జట్టు సైతం ప్రారంభంలో తడబడింది. అయితే రాస్ టేలర్ (25) వేగంగా పరుగులు సాధించడం, ద్రావిడ్, కలిస్‌లు రాణించడంతో బెంగుళూరు జట్టు 19 ఓవర్లలో 135 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా బెంగుళూరు జట్టు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్‌కలమ్
మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?
సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీ
నా ఫామ్‌కు కారణం జలక్రీడలే: హేడెన్
ఐపీఎల్‌లో మా బౌలింగ్ చెత్తగా ఉంది: ధోనీ
గాయం కారణంగా ఆటకు దూరమైన జేమ్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...