|
| మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా? |
| డర్బన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 17:37 IST ) | |
చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే వరుస పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంకా ఆ అవకాశాలు ఉంచుకున్న జట్లను బెంబేలెత్తిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్ విజయం సాధించడంతో ఈ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే తరువాతి మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే బుధవారం జరిగే మరో (చివరి) లీగ్ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఉంది.
గత సీజన్‌లో టైటిల్‌ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ రెండో సీజన్‌లో ఇప్పటివరకు కొన్నిసార్లు మాత్రమే తాము డిఫెండింగ్ ఛాంపియన్స్‌మని గుర్తు చేయగలిగింది. కొంత మంది ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, మరికొందరు గాయాలతో దూరమవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ సీజన్‌లో శాపాలయ్యాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|