|
| సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీ |
| డర్బన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 17:26 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో ఓ రసవత్తరమైన మ్యాచ్‌కు డర్బన్ వేదిక కానుంది. బుధవారం ఇక్కడ జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సెమీస్‌లో చోటు కోసం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హోరాహోరీగా పోరాడనున్నాయి. ఈ రెండు జట్లతోనూ సెమీస్ చోటు దోబూచులాడుతోంది.
సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకివ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ సెమీస్ ఆశలన్నీ ఈ మ్యాచ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడు విజయాల ద్వారా లభించిన 15 పాయింట్లతో (మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఒక పాయింట్ వచ్చింది) చెన్నై రెండో స్థానంలో ఉంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్‌పై పరాజయం కారణంగా.. రెండు వరుస విజయాలతో మంచి ఉత్సాహం మీద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడే మ్యాచ్‌లో చెన్నై చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సోమవారం లీగ్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో చెన్నైను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|