|
| చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణిగా జెంగ్ జియా |
| బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 14:10 IST ) | |
ప్రపంచ స్థాయి 15 నంబరు టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ జియా చైనా తరపున అగ్రశ్రేణి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన ర్యాంక్స్ ఈ అంశాన్ని ధృవీకరించాయి. అయితే తాజాగా తనకు లభించిన గౌరవం ప్రారంభం మాత్రమేనని తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని జెంగా జియా ఈ సందర్భంగా పేర్కొంది.
చైనాకు చెందిన ఈ 25 ఏళ్ల క్రీడాకారిణి గత ఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనలిస్టుగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ స్థాయిలో 15వ ర్యాంకును సొంతం చేసుకున్న జియా చైనా తరపున అగ్రస్థానం ఆక్రమించింది. అంతకుముందు 2007లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానాన్ని సాధించడం ద్వారా లీనా చైనా తరపున అగ్రశ్రేణి క్రీడాకారిణిగా కొనసాగుతూ వస్తోంది.
తాజా ర్యాంకింగ్‌తో లీనా స్థానాన్ని జియా ఆక్రమించింది. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జియా మాట్లాడుతూ లక్ష్యం లేనపుడు ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని పేర్కొంది. తాను ప్రస్తుతం సాధించిన ర్యాంకు ఇతరులకు ఆశ్చర్యం కలిగించకపోవచ్చుగానీ తనకు మాత్రం ఓ గొప్ప ప్రారంభానికి ఇది తొలిమెట్టుగా ఆమె పేర్కొంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|