|
| విజయంతో మళ్లీ తెరమీదకు షరపోవా |
| వార్సా (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 12:59 IST ) | |
మాజీ ప్రపంచ నంబర్‌వన్ రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా విజయంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. గాయం కారణంగా గత తొమ్మిదిన్నర నెలలుగా ఆటకు దూరమైన షరపోవా ఇటీవల ప్రారంభమైన వార్సా ఓపెన్ టోర్నీలో భాగంగా ఇటలీకి చెందిన తతియానా గార్బిన్‌ను 6-1, 6-7 (6/8), 6-3 తేడాతో విజయాన్ని సాధించింది.
22ఏళ్ల ఈ రష్యా సుందరి టెన్నిస్‌ను కెరీర్‌గా ప్రారంభించిన తర్వాత ప్రపంచ నెంబర్‌వన్ స్థాయికి చేరింది. అయితే దాదాపు ఏడాది క్రితం గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించిన షరపోవా ఆటకు దూరం కావడంతో ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 126వ స్థానానికి చేరింది. అయితే తాజాగా వార్సా ఓపెన్‌లో శుభారంభం చేయడం ద్వారా షరపోవా తన పునరాగమనాన్ని ఘనంగా చాటినట్టైంది.
టెన్నిస్ క్రీడాకారిణిగా అత్యధిక సంపాదనపరురాలిగా గుర్తింపు సాధించిన షరపోవా గత ఏడాది వేసవిలో భుజం గాయం కారణంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగా షరపోవా గత ఏడాది జరిగిన వింబుల్డన్, అమెరికా ఓపెన్లతో సహా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు సైతం దూరమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|