|
| ఇంగ్లాండ్ కోచ్ మూర్స్, కెప్టెన్ పీటర్సన్ రాజీనామా |
| లండన్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 18:19 IST ) | |
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ బుధవారం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోచ్ పీటర్ మూర్స్, పీటర్సన్‌కు మధ్య జరిగిన మాటల యుద్ధానికి గత కొన్నిరోజులగా భారీఎత్తున ప్రచారం లభించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా పీటర్సన్ మొదట కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అనంతరం కాసేపటికే కోచ్ మూర్స్ కూడా రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుండటంతో, వీరిద్దరూ రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఐదు నెలల క్రితం ఇంగ్లాండ్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన పీటర్సన్, గత కొంత కాలంతో మూర్స్‌తో కలిసి పనిచేసేందుకు అయిష్టత చూపుతున్నాడు.
మాజీ కెప్టెన్ మైకెల్ వాన్‌ను జట్టులో చేర్చకపోవడంతో తాజాగా వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం అనంతరం0 కోచ్ బాధ్యతల నుంచి మూర్స్‌ను తప్పించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు పీటర్సన్ విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పీటర్సన్ వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తితో ఉంది. కోచ్‌పై మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం బోర్డు ఆగ్రహం చెందింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|