యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
సిడ్నీ టెస్ట్ విజయం: అగ్రస్థానంలోనే ఆస్ట్రేలియా
దుబాయ్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 17:31 IST )
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‍లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియా, సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో విజయం సాధించి పరువు నిలుపుకుంది.

ఈ విజయం ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కూడా ఉపయోగపడింది. సిడ్నీ టెస్ట్‌లో బుధవారం దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 103 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు 2-1 తేడాతో కోల్పోయింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఐదు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది.

మూడో స్థానంలో ఉన్న భారత్‌కు, ఆస్ట్రేలియాకు ఎనిమిది పాయింట్ల తేడా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఐదో స్థానంలోనూ, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజీలాండ్ తరువాతి స్థానాల్లోనూ నిలిచాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ నుంచి జకోవిచ్ నిష్క్రమణ
భద్రతా పరిస్థితి పరిశీలనకు సీజీఎఫ్ బృందం
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ ముందంజ
భారత్‌పై పరాజయం: బ్యాటుతో కొట్టుకున్న అఫ్రిది
కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన
చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...