|
| కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన |
| ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 12:54 IST ) | |
ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌లో భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనలో ఆడే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మరో మ్యాచ్ చేర్చాలని బీసీసీఐ సోమవారం ఆ దేశ క్రికెట్ బోర్డుకు అధికారిక ప్రతిపాదన పంపింది.
టీం ఇండియా న్యూజీలాండ్ పర్యటన మార్చి 6న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీం ఇండియా రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ- 20 మ్యాచ్ ఆడనుంది.
అయితే తాజాగా టెస్ట్ సిరీస్‌లో మరో మ్యాచ్ చేర్చాలని న్యూజీలాండ్ క్రికెట్ బోర్డుకు ప్రతిపాదన పంపామని, దీనిపై ఆ దేశ బోర్డు త్వరలోనే స్పందిస్తుందని బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహకుడు రత్నాకర్ శెట్టి తెలిపారు.
ముంబయి తీవ్రవాద దాడుల నేపథ్యంలో.. పాకిస్థాన్‌లో పర్యటనను రద్దు చేయడం, ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో చివరి రెండు వన్డే మ్యాచ్‌లు ఆడకపోవడం వలన బీసీసీఐకి రూ.120 కోట్ల నష్టం వాటిల్లిందని రత్నాకర్ శెట్టి వెల్లడించారు.
ఇదిలా ఉంటే బీసీసీఐ వచ్చే నెలలో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకోవడంతో ఏర్పడిన విరామాన్ని పూడ్చేందుకు బీసీసీఐ ఈ దిశగా ఆలోచన చేస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|