యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
షోయబ్‌ను అమ్మకానికి పెట్టిన నైట్‌రైడర్స్
కోల్‌కతా (ఏజెన్సీ), 6 జనవరి 2009   ( 12:00 IST )
వివాదాస్పద ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్‌ను తమ జట్టులో కొనసాగించడానికి కోల్‌కత నైట్‌రైడర్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో అక్తర్‌ను కొనసాగించాలనుకోవడం లేదని నైట్‌రైడర్స్ కోచ్ జాన్ బుచానన్ సోమవారం విలేకరులతో చెప్పారు.

అక్తర్‌ను అమ్మకానికి పెట్టామని వెల్లడించారు. అక్తర్‌, మరో పాకిస్థానీ బౌలర్ ఉమర్ గుల్‌లను వచ్చే సీజన్‌లో కొనసాగించాలనుకోవడం లేదని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న సెలక్షన్ ట్రయిల్స్ తొలిరోజున ఆయన తెలిపారు. నైట్‌రైడర్స్‌తోపాటు, మరో కొన్ని ప్రాంఛైజీలు కూడా ఆటగాళ్లను అమ్మకానికి పెట్టాయి. ఆటగాళ్ల అమ్మకానికి జనవరి 22తో గడువు ముగుస్తుంది.

ఈ గడువులోగా ఎనిమిది ప్రాంఛైజీలకు ఆటగాళ్లను విక్రయించడం, లేదా ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆఫర్ ప్రకటించే వీలుంది. అయితే అక్తర్ ప్రదర్శనపై తమకు అసంతృప్తి లేదని బుచానన్ వివరించారు. అక్తర్ ప్రదర్శనపై జట్టు యాజమాన్యం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం కూడా ఉందన్నారు. అయితే అతన్ని ప్రస్తుతం అమ్మకానికి ఉంచామని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
హాప్‌మేన్ కప్: ఇటలీపై రష్యా విజయం
రంజీ సెమీస్: పటిష్ట స్థితిలో ముంబయి, తమిళనాడు
బంగ్లా 208 ఆలౌట్: శ్రీలంకకు 176 పరుగుల ఆధిక్యత
కోలుకున్న ఆసీస్: ప్రోటీస్ ధీటైన సమాధానం
సోమ్‌దేవ్ చేతిలోనే భారత టెన్నిస్ భవిత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...