|
| ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం |
| సిడ్నీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 12:45 IST ) | |
సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా 1118 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు టెయిలెండర్లపై సిడిల్ విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 327 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టను పాలో ఆన్ గండం నుంచి తప్పించిన బౌచర్ (89) చివరి బ్యాట్స్‌మేన్‌గా నిష్క్రమించాడు.
మోర్కెల్ (40)తో కలిసి బౌచర్ ఏడో వికెట్ 115 పరుగులు జోడించగా, ఆ తర్వాత నాలుగు వికెట్లు 19 పరుగుల వ్యవధిలో రాలిపోయాయి. సిడిల్ ఐదు వికెట్లు పడగొట్టగా, జాన్సన్ రెండి, డొనాల్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. స్మిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ స్మిత్ (30) తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్టు నష్టపోకుండా 33 పరుగులు చేసింది. హేడెన్ 18 పరుగులతో, కటీచ్ 9 పరుగులతో క్రీజుపై ఉన్నారు. ఇప్పటికే తొలి రెండు టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకోవడంతో ఈ మ్యాచ్‌లో అయినా నెగ్గడమే కాక నెంబర్ వన్ స్థానాన్ని కూడా నిలబెట్టుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|