యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
హాప్‌మేన్ కప్: ఇటలీపై రష్యా విజయం
హైదరాబాద్, 5 జనవరి 2009   ( 12:21 IST )
తోబుట్టువులైన మరాత్ సఫిన్, దినారా సఫినాల ప్రతిభతో మాజీ ఛాంపియన్ రష్యా హాప్‌మేన్ కప్ ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో ఇటలీపై విజయం సాధించింది. వారిద్దరూ పురుషుల, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో గెలిచినప్పటికీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం చేతులెత్తేశారు.

హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో మరాత్ సఫిన్ 7-6, 6-4 సెట్లతో బోలేలీపై విజయం సాధించగా, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకు క్రీడాకారిణి అయిన సఫీనా 7-5, 6-3 సెట్లతో పెన్నెట్టాపై గెలుపొందింది.

అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం రష్యా జంట హోరాహోరీగా పోరాడినప్పటికీ ఇటలీ జంటనే విజయం వరించింది. ఇటలీ జంట 5-7, 6-4, 7-6 సెట్లతో సఫిన్- సఫీనాలపై గెలుపొందింది. తర్వాతి రౌండ్లో రష్యా బుధవారం తైవాన్ జట్టుతో తలపడనుంది.

తైవాన్ జట్టు తొలి రౌండ్లో ఫ్రాన్స్ చేతిలో 3-0తో ఓటమిపాలైంది. సోమవారం ప్రారంభం కానున్న గ్రూప్ ఏ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో జర్మనీ తలపడనుండగా, ఐదు పర్యాయాల విజేత అమెరికాతో స్లోవేకియా పోరాడనుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రంజీ సెమీస్: పటిష్ట స్థితిలో ముంబయి, తమిళనాడు
బంగ్లా 208 ఆలౌట్: శ్రీలంకకు 176 పరుగుల ఆధిక్యత
కోలుకున్న ఆసీస్: ప్రోటీస్ ధీటైన సమాధానం
సోమ్‌దేవ్ చేతిలోనే భారత టెన్నిస్ భవిత
రెండో వన్డేలో కివీస్‌పై వెస్టిండీస్ విజయం
ఇంటర్ కార్పొరేట్ టోర్నీకి బీసీసీఐ సన్నాహాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...