|
| బంగ్లా 208 ఆలౌట్: శ్రీలంకకు 176 పరుగుల ఆధిక్యత |
| చిట్టగాంగ్, ఆదివారం, 4 జనవరి 2009 ( 16:17 IST ) | |
చిట్టగాంగ్‌లో జరిగే రెండో టెస్టులో బంగ్లాదేశ్ 208 పరుగులకే ఆలౌట్ కావడంతో శ్రీలంకకు 176 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 145 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి, ఫాలో ఆన్ ప్రమాదంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌ను పేస్ బౌలర్ మష్రాఫ్ మొర్తజా (63) ఆదుకోవడంతో ఆ జట్టు ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడింది.
అతనితో పాటు కెప్టెన్ మొహమ్మద్ అష్రఫుల్ (45), జునైద్ సిద్ధిక్ (28) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. శ్రీలంక జట్టులో అజంతా మెండిస్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మురళీధరన్ మూడు, వాస్ రెండు, దిల్హారా ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు శ్రీలంక జట్టు 384 పరుగులు చేసి, ఆలౌటైంది. టాప్ ఆర్డర్‌లో వర్నపురా (63) తప్ప మిగిలిన వారంతా చేతులెత్తేయగా ఓ దశలో 75 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను దిల్షాన్ (162), కపుగెడెరా (96)లు ఆదుకోవడంతో భారీ స్కోరు చేయగలిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|