|
| ఇంటర్ కార్పొరేట్ టోర్నీకి బీసీసీఐ సన్నాహాలు |
| ముంబయి, శనివారం, 3 జనవరి 2009 ( 17:08 IST ) | |
కార్పొరేట్ సంస్థలు పాల్గొనేలా ఓ ప్రైజ్ మనీ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. క్రికెటర్లను తమ సంస్థల్లో చేర్చుకోవడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకై వ్యాపార సంస్థలను ప్రోత్సహించేలా ఈ టోర్నీని నిర్వహించాలని తలపెట్టింది. ముంబయిలో శనివారం జరిగిన బీసీసీఐ కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఈ టోర్నీ నిర్వాహణకోసం బీసీసీఐ సంయుక్త కార్యదర్శి సంజయ్ జగ్‌దాలే అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో విశ్వనాథన్, ఆర్ ఎస్ షెట్టి, చాముండేశ్వరినాథ్, రంజీబ్ బిశ్వాల్, అనిరుధ్ చౌదరిలు ఉన్నారని బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్ ఓ ప్రకటనలో తెలిపారు.
టోర్నీలో విజేతలకు రూ. కోటి, రన్నరప్‌కు రూ. 50లక్షలు ఇస్తామని, అలాగే సెమీస్ వరకు మాత్రమే వచ్చిన జట్లకు రూ. పాతిక లక్షలు అందిస్తామని బీసీసీఐ తెలిపింది. ముంబయి దాడుల నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో రెండు వన్డేలు, పాక్ టూర్ రద్దు కారణంగా తమ రాబడి అంచనా రూ. 120 కోట్ల మేర దెబ్బతిన్నదని కూడా తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|