యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
క్లార్క్ ఒంటరిపోరు: మళ్లీ ప్రోటీస్‌దే పైచేయి
సిడ్నీ, శనివారం, 3 జనవరి 2009   ( 13:09 IST )
మరోసారి దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో సిడ్నీ టెస్టులోనూ ఆస్ట్రేలియా కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. క్లార్క్ (73)తో పాటు జాన్సన్ (17)లు క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఆసీస్‌పై క్లీన్ స్వీప్ సాధించడమే కాక ప్రపంచ నెంబర్ వన్ కాగలమని ప్రోటీస్ ఉవ్విళ్లూరుతోంది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి వికెట్‌కు హేడెన్ (31), కటీచ్ (47)లు 62 పరుగులు జోడించారు. అయితే మరో వంద పరుగులు జోడించేలోపు వారిద్దరితో పాటు పాంటింగ్ (0), హస్సీ (30), డొనాల్డ్ (15) వికెట్లను కూడా ఆస్ట్రేలియా కోల్పోయింది.

అయితే ఆ తర్వాత క్లార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించిన హాడిన్‌ (38) ఎట్టకేలకు స్టెయిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత క్లార్క్‌కు తోడుగా క్రీజులోకి వచ్చిన జాన్సన్ (17) ఇప్పటివరకు 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రోటీస్ బౌలర్లలో స్టెయిన్ రెండు, ఎన్తిని, కల్లీస్, హారిస్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫెదరర్‌‌కు ముర్రే షాక్: నాదల్‌తో ఢీకి రెడీ
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్
పాక్‌తో సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...